ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.  కొత్తగా 196 కరోనా కేసులు నమోదయ్యాయి.  వైరస్ కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 184 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మెుత్తం.. మొత్తం 20,68,672 మందికి కేసులు నమోదయ్యాయి.  20,52,084 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ.. 14,429 మంది మరణించారు. ప్రస్తుతం 2,159 మంది చికిత్స పొందుతున్నారు.






 


దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 7,579 కేసులు నమోదుకాగా 236 మంది మరణించారు. గత 543 రోజుల్లో ఇదే కనిష్ఠం. 12,202 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.



  • మొత్తం కేసులు: 3,45,26,480

  • ‬మొత్తం మరణాలు: 4,66,147

  • యాక్టివ్​ కేసులు: 1,13,584

  • మొత్తం కోలుకున్నవారు: 3,39,46,749


యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584 వద్ద ఉంది. గత 536 రోజుల్లో ఇదే అత్యల్పం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.


గత 46 రోజులుగా రోజువారీ కేసులు 20వేల కంటే తక్కువే ఉన్నాయి. గత 149 రోజులుగా 50 వేల కంటే తక్కువే ఉన్నాయి. రికవరీ రేటు 98.32గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.


కేరళ..


కేరళలో కొత్తగా 5,080 కేసులు నమోదయ్యాయి. 196 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,89,175కు పెరిగింది. మరణాల సంఖ్య 37,495కు చేరింది. గత 24 గంటల్లో 53,892 శాంపిళ్లు పరీక్షించారు.


మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 873 కేసులు నమోదయ్యాయి. కోజికోడ్ (740), తిరువనంతపురం (621) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో 656 కరోనా కేసులు నమోదుకాగా 8 మంది మృతి చెందారు. 


Also Read: Ap Legislative Council : మండలిని రద్దు చేయవద్దు ..ప్లీజ్.. ! కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం !


Also Read: YSRCP Kadapa : పంచాయతీ నిధులు తీసేసుకున్న ఏపీ ప్రభుత్వం.. కడప జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ సర్పంచ్‌ల రాజీనామా