ఏపీలో కొత్తగా 183 కరోనా కేసులు కొనసాగుతున్నాయి. కొవిడ్ కారణంగా కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 30,863 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 163 మంది కోలుకున్నారు. రాష్ట్రం లోని ఇప్పటి వరకు మొత్తం 20,69,119 పాజిటివ్ కేసులకు గానూ.. 20,52,494 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మెుత్తం 14,431 మంది వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం 2,194 మంది చికిత్స పొందుతున్నారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 9,119 కేసులు నమోదుకాగా 396 మంది మృతి చెందారు. 10,264 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,09,940కి చేరింది. గత 539 రోజుల్లో ఇదే అత్యల్పం.
రికవరీ రేటు 98.33%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మొత్తం రికవరీల సంఖ్య 3,39,67,962కు పెరిగింది.
కేరళ..
కేరళలో కరోనా కేసుల సంఖ్య 51 లక్షలు దాటింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 51,02,125కు పెరిగింది. కొత్తగా 4,280 కరోనా కేసులు నమోదవగా 308 మంది మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి. మొత్తం మృతుల సంఖ్య 38,353కు పెరిగింది.
మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధికంగా 838 కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (825), త్రిస్సూర్ (428) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
గత 24 గంటల్లో 48,916 కరోనా శాంపిళ్లను పరీక్షించారు.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 960 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. గత నాలుగు రోజులుగా రోజువారి కేసులు 10 వేల కంటే తక్కువగా ఉన్నాయి.
Also Read: Chandrababu Naidu: తండ్రి తాగితేనే అమ్మ ఒడి.. అలాంటి పథకాలు మనకు అవసరమా?
Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !
Also Read: Chiru : దేశమంతా ఒకే జీఎస్టీ - టిక్కెట్ రేట్లూ అలాగే ఉండాలి.. జగన్ సర్కార్‌కు చిరంజీవి విజ్ఞప్తి !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి