ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో 31,957 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. ఇందులో 181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,011 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు.. మొత్తం 20,71,322 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం 20,54,854 మంది డిశ్చార్జ్  అయ్యారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 14,457 మంది మరణించారు.


దేశంలో రోజువారి కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కొత్తగా 8,439 కేసులు నమోదుకాగా 195 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 93,733కు చేరింది. గత 555 రోజుల్లో ఇదే అత్యల్పం.


మొత్తం కేసులు: 34,656,822
మరణాలు: 4,73,952
యాక్టివ్ కేసులు: 93,733
కోలుకున్నవారు: 3,40,89,137


మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.27గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. మరణాల సంఖ్య 4,73,952కు పెరిగింది. మొత్తం రికవరీల సంఖ్య 3,40,89,137కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
రికవరీ రేటు 98.36 శాతంగా ఉంది. కరోనా సంక్షోభం మొదలైన నాటి నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు. 


వ్యాక్సిన్..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 129.54 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 


ఒమిక్రాన్ కేసులు..
భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ నెమ్మదిగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మరింత కలవరం పెరిగింది. మహారాష్ట్రలో ఇప్పటికే ఎనిమిది ఒమిక్రాన్  కేసులు వెలుగుచూశాయి. తాజాగా ముంబయిలో వచ్చిన కేసులతో మొత్తం సంఖ్య 10కి చేరింది. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 37 ఏళ్ల వ్యక్తితో పాటు అమెరికా నుంచి వచ్చిన మరో వ్యక్తి(36)కి ఒమిక్రాన్‌ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 23కి పెరిగింది.  


Also Read: CM Jagan Review : ఓటీఎస్ స్వచ్చందం..ప్రయోజనాల గురించి లబ్దిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ !


Also Read: Tollywood Drugs : టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?


Also Read: Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత... సీక్రెట్ పాకెట్ లో స్మగ్లింగ్...


Also Read: Nellore Farmers: నెల్లూరులో తగ్గిన వరదలు.. ఇంతలో మరో సమస్య, అవస్థలు పడుతున్న రైతులు