AP Inter 1st Year Results 2026| ఇంటర్ రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి | AP 1st Year Inter Results 2026 | ఏపీ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్
AP Board Result Dates
AP Inter 1st Year Results 2026
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తాడేపల్లిలోని బోర్డు కార్యాలయంలో బుధవారం ఉదయం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లతో పోల్చితే పెరిగింది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5, 31, 275 మంది ఉన్నారు. ఈ గణాంకాల్లో జనరల్ స్ట్రీమ్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు ఇద్దరూ ఉన్నారు.
మీ ఫోన్లో 9552300009 నెంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెస్సేజ్ చేసి రిజల్ట్స్ చేక్ చేసుకోవచ్చు. Hi అని మెస్సేజ్ తరువాత వచ్చే సూచనల ప్రకారం మీ హాల్‌టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సెకన్లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.