Telangana TS Inter 1st Year Vocational Results 2025: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి

Telangana TS Inter 1st Year Vocational Results 2025: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్ ఒకేషనల్ రిజల్ట్స్‌ ఇక్కడ చెక్ చేసుకోండి

TS Inter 1st Year Vocational Results 2025: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదల కానున్నాయి. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.


Telangana 1st Year Inter Vocational Results 2025: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ఫస్టియర్ రెగ్యూలర్‌తోపాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఒకేషనల్ కోర్సుతో కలిసి మొదటి ఏడాది పరీక్షలను మార్చి 5 నుంచి మార్చి 24 వరకు తెలంగాణలో ఇంటర్ బోర్డ్ నిర్వహించింది. ఈ ఏడాది ఇంటర్ మొద‌టి సంవత్సరం 5,00,572 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో మంగళవారం ఉదయం ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.