AP 10th result 2025: ఏపీలో టెన్త్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలకానున్నాయి. రిజల్ట్స్ కోసం ఇక్కడ చెక్ చేసుకోండి.

AP SSC Result 2025: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.


AP SSC Results 2025: ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఫలితాలను ఆన్ లైన్, వాట్సాప్ లో అప్ లోడ్ చేసి విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ అందుబాటులో ఉంటాయి. దీంతో వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు వివరాలు వెల్లడించారు.అభ్యర్థులకు ఫలితాల కోసం వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలు ఎంచుకుని, ఆపై టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ ద్వారా ఫలితాల PDF కాపీని పొందవచ్చు.