AP Inter 2nd Year Results 2025 Live - ఇంటర్ రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి | Andhra Pradesh Intermediate Results
AP Inter 2nd Year Results 2025: ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.
AP Inter 2nd Year Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండియర్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థుల ఫలితాలు కూడా వచ్చేశాయ్. ఏబీపీ దేశం వెబ్‌సైట్, అధికారిక వెబ్‌సైట్లలో విద్యార్థులు వివరాలు నమోదుచేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు మొత్తం 10 లక్షల 17 వేల 102 విద్యార్ధులు హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ సొసైటి ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగగా, 67వేల 952 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారని అధికారులు తెలిపారు.