ఆరువేల రూపాయలను ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తోంది. పెట్టుబడి సాయం కింద ఈ నిధులను రైతుల ఖాతాల్లో నేరుగా వేస్తోంది. కరోనా టైంలో ఈ డబ్బులు రైతులకు చాలా ఉపయోగపడ్డాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ఓ విడత డబ్బులను జనవరి 1న రైతుల ఖాతాల్లో వేసిన ప్రభుత్వం తర్వాత విడత డబ్బులు ఎప్పుడు వేస్తారనే చర్చ నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
ఏప్రిల్ మొదటి వారంలో పీఎం కిసాన్ యోజన నిధులు రైతు ఖాతాల్లో పడనున్నాయని సమాచారం. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ యోజన పథకానికి ఇచ్చే నిధులు పెంచితే మాత్రం రైతుల పంట పండినట్టే.
పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఇప్పటికి ఏడాదికి ఆరువేలు ఇస్తున్న కేంద్రం మరో రెండు వేలు పెంచనున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని వినికిడి. అందుకే ఏప్రిల్‌లో పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా డబ్బులు పడటం ఖాయమైనా ఎంత పడుతుందనేది ఇప్పుడు కొత్త చర్చ. దీనిపై నిర్మల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.