ఒక సాధారణ ఏనుగుకు మొత్తం 26 దంతాలు ఉంటాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

ఇందులో బయటకు కనిపించే రెండు కోరలు , లోపల ఉండే 24 నమలడానికి ఉపయోగపడే దంతాలు ఉంటాయి.

Image Source: pexels

బయటకు కనిపించే పెద్ద దంతాలు ఇన్సిజర్దం తాలు. ఇవి ఏనుగు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి.

Image Source: pexels

వీటిని ఆహారం కోసం చెట్ల బెరడును ఒలవడానికి, నేలను తవ్వడానికి, బరువులు ఎత్తడానికి ఆత్మరక్షణ కోసం ఉపయోగించుకుంటాయి.

Image Source: pexels

ఆఫ్రికన్ ఏనుగులలో ఆడ, మగ రెండింటికీ కోరలు ఉంటాయి. కానీ ఆసియా ఏనుగులలో కేవలం మగ ఏనుగులకు మాత్రమే కోరలు ఉంటాయి

Image Source: pexels

ఏనుగు నోటి లోపల నాలుగు దవడల భాగాలలో ఒక్కో వైపు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 4 పెద్ద దంతాలు ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి.

Image Source: pexels

ఏనుగు దంతాలు వాటి జీవితకాలంలో 6 సార్లు మారుతాయి. పాత దంతం అరిగిపోయినప్పుడు, వెనుక నుండి కొత్త దంతం ముందుకు వస్తుంది.

Image Source: pexels

ఏనుగు యొక్క ఒక్కో దంతం సుమారు ఒక ఇటుక పరిమాణంలో ఉండి, సుమారు 2 నుండి 5 కిలోల బరువు ఉంటుంది.

Image Source: pexels

ఏనుగు కోరలను 'ఐవరీ' అని పిలుస్తారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉండటం వల్ల ఏనుగులను వేటాడటం చట్టవిరుద్ధం.

Image Source: pexels