మహిళలు కచ్చితంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందే



ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా వస్తున్న క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి.



ఇది లైంగికంగా సంక్రమించే ఒక అంటు వ్యాధి. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ద్వారా ఈ క్యాన్సర్ వస్తుంది.



ఈ వైరస్ సోకిన వారిలో కొంతమందికి అది క్యాన్సర్ గా మారుతుంది. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందుగానే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా అవసరం.



పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ Cervavac పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.



ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇది అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్లు ఉండే అవకాశం ఉంది.



ఈ వ్యాక్సిన్ రెండు నుంచి మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.



ఒక్కో డోసు ధర ప్రస్తుతం 2000 రూపాయలు.



ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో 27 శాతం మంది మనదేశంలోనే ఉన్నారు.