సినిమా పరిశ్రమను పురుషాధిక్య ప్రపంచంగా పేర్కొంటారు. దర్శక, నిర్మాణంలో ఎక్కువమంది మగవాళ్ళు ఉంటారు. అయితే... కొందరు మహిళలు కూడా మెగాఫోన్ పట్టుకున్నారు. దర్శకురాలిగా విజయవంతమైన సినిమాలు తీశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళలు ఎవరో చూద్దామా?



అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో విజయనిర్మల చోటు సొంతం చేసుకున్నారు.

తెలుగులో తొలి మహిళా దర్శకురాలు భానుమతి. 'వర విక్రయం', 'చండీరాణి' చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. 

'చంటిగాడు', 'లవ్లీ' వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకురాలు బి. జయ.

రాజశేఖర్ 'శేషు', 'ఆప్తుడు', 'ఎవడైతే నాకేంటి', 'సత్యమేవ జయతే', 'మహంకాళి' చిత్రాలకు జీవిత దర్శకురాలు.

'అలా మొదలైంది'తో దర్శకురాలిగా ప్రయాణం ప్రారంభించిన నందినీ రెడ్డి... 'ఓ బేబీ' అంటూ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు.

వెంకటేష్ 'దృశ్యం'కు శ్రీప్రియ దర్శకత్వం వహించారు. 

నాగశౌర్య, రీతూ వర్మల 'వరుడు కావలెను'తో దర్శకురాలిగా తొలి సినిమాతో లక్ష్మీ సౌజన్య హిట్ అందుకున్నారు. 

'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో కొరియోగ్రాఫర్ సుచిత్రా చంద్రబోస్ దర్శకురాలిగా మారారు. 

'పడేసావే' సినిమాకు చునియా దర్శకత్వం వహించారు. 

ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ కూడా దర్శకురాలే. ఆమె 'సాహేబా సుబ్రహ్మణ్యం' సినిమా తీశారు. 

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన 'చూసీ చూడంగానే' సినిమాతో శేష సింధు రావు దర్శకురాలిగా పరిచయమయ్యారు.

'శేఖరం గారి అబ్బాయి' చిత్రానికి కథానాయిక అక్షతా శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

రాజ్ తరుణ్ 'రంగులరాట్నం' సినిమాకు శ్రీ రజని దర్శకురాలు. 

రాజ్ తరుణ్ 'రాజుగాడు' సినిమాతో జర్నలిస్ట్ సంజనా రెడ్డి దర్శకురాలిగా మారారు.