సముద్రాలు లేకపోతే మన పరిస్థితేంటి?



మనం భూమిపై ఎంత ఆధారపడి ఉన్నామో, పరోక్షంగా సముద్రాలపై కూడా అంతే ఆధారపడి జీవిస్తున్నాం.



పర్యావరణ సమతుల్యానికి, మనిషి జీవించే వాతావరణం ఉండేందుకు సముద్రాలు ఎంతో సహకరిస్తున్నాయి.



సముద్రాలే లేకుంటే మనిషి బతకడం కష్టతరంగా మారుతుంది. వాతావరణ సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది.

వర్షాలు, రుతు పవనాలు రాక సముద్రాల వల్లే వీలవుతుంది.

రుతుపవనాలే రాకపోతే భూమి పరిస్థితి, భూమిపై నివసించే మనుషులు ఏమవుతారో ఓసారి ఊహించుకోండి.



భూమిపై ఉష్ణోగ్రతలను పూర్తిగా నియంత్రించేది సముద్రమే.



కొన్ని విషపూరితమైన వాయువులను కూడా సముద్రం పీల్చుకుంటుంది.



సముద్రాలు లేని భూమిపై మనిషి ఎంతో కాలం జీవించ లేడు. కరవు కాటకాలతో మానవజాతే అంతరించిపోతుంది.