మృగశిర కార్తె రోజు చేపలు తింటే ఏమవుతుంది?

రోహిణి కార్తెల కారణంగా మండిన ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతారు. మృగశిర కార్తె మొదలవ్వగానే వాతావరణం చల్లబడుతుంది.

చల్లబడిన వాతావరణం రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

అందుకే మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలని చెబుతున్నారు పూర్వీకులు.

చేపలు తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత సమస్థాయిలో ఉండేలా ఇందులోని పోషకాలు చూసుకుంటాయి. జీర్ణశక్తి కూడా నెమ్మదించకుండా చురుగ్గా ఉండేలా చేస్తాయి.

వీటిల్లో 20రకాల ప్రొటీన్లు ఉంటాయి, అవన్నీ చాలా సులువుగా అరుగుతాయి.

చేపల్లో దొరికే కొవ్వు కూడా మనకు అవసరమైనది. గర్భిణీలకు, గుండె జబ్బులు ఉన్నవారికి, పిల్లలకు ఈ కొవ్వు చాలా అవసరం.

చేప కొవ్వులోనే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీని ద్వారా విటమిన్ ఎ, డి, ఇ లు శరీరానికి అందుతాయి.

బిర్యానీ,కూర, వేపుడు... చేపలను ఏ రూపంలో తిన్నా వల్ల లాభమే కానీ నష్టం లేదు అని వివరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు.