ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ-కామర్స్ విభాగంలో పెట్టుబడులను మెటా పెంచింది. దీంతో కొన్ని రంగాల్లో తగ్గించింది. మెటా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఊహించిన దానికంటే తక్కువ ఉన్నాయని జుకర్‌బర్గ్ తెలిపారు. యాపిల్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్‌పరెన్సీ కారణంగా మెటా 10 బిలియన్ డాలర్లు నష్టపోయింది. టిక్‌టాక్ వీడియోల కారణంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీ ఎదురైంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మెటా ఖర్చు 19.1 శాతం పెరిగింది. కంపెనీ ఓవరాల్ సేల్స్ నాలుగు శాతం, ఆపరేషనల్ ఇన్‌కం ఏకంగా 46 శాతానికి తగ్గిపోయింది. పెట్టుబడుల విషయంలో తాము మరింత సమర్థవంతంగా వ్యవహరించాలని మార్క్ అభిప్రాయపడ్డాడు. మెటావర్స్ రియాలిటీ ల్యాబ్స్ కారణంగా కంపెనీకి 10 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది.