మనం డీజిల్ కారును పెట్రోల్‌తోనూ, పెట్రోల్ కారును డీజిల్‌తోనూ నడపలేం. కానీ ఒకవేళ పొరపాటున మార్చి కొట్టిస్తే... ఏం అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే చాలా ప్రమాదం. ఇంజిన్ వెంటనే ఆగిపోతుంది. ఇది వాహనాన్ని డ్యామేజ్ కూడా చేస్తుంది. పెట్రోల్‌లో ఐదు శాతం కంటే తక్కువ డీజిల్ ఉంటే ఎటువంటి ప్రమాదం లేదు. కారు వెంటనే స్టార్ట్ అవుతుంది. ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటే మాత్రం దగ్గరలో ఉండే గ్యారేజ్‌కు తీసుకెళ్లి ట్యాంకు ఖాళీ చేయించాలి. అప్పటికి కారును డ్రైవ్ చేసి ఉంటే ఇంజిన్‌ను కూడా క్లీన్ చేయించాలి.