ఇంజెక్షన్ భయాన్ని ఏమని పిలుస్తారో తెలుసా?



ఇంజెక్షన్ వేయించుకునేందుకు భయపడడాన్ని ట్రిపనోఫోబియా (Trypanophobia) అంటారు.



పదునైన వస్తువులు గుచ్చుకుంటాయేమో అన్న భయమే పెరిగి పెద్దయ్యాక ఇలా ట్రిపనోఫోబియాగా మారుతుంది.

ఇలాంటి భయాలు ఎందుకు పుడతాయో కచ్చితంగా చెప్పలేకపోతున్నారు వైద్యులు.

ఇంట్లో పెద్దవాళ్లెవరైనా అనారోగ్యాలు పాలై వారు ఇంజెక్షన్లు తీసుకునేందుకు పడుతున్న బాధను చూసి కూడా కొందరి పిల్లల్లో ఈ ఫోబియా మొదలవ్వచ్చు.

ఇలాంటి ఫోబియాలను వదిలించుకోవాలంటే మానసిక వైద్యుల సహాయం అవసరం.

థెరపీల ద్వారా ఫోబియాలను పొగొట్టే అవకాశం ఉంది. ఇందుకు ఒక్కోసారి నెల రోజుల నుంచి ఏడాది వరకు కూడా సమయం పట్టచ్చు.

అన్నింట్లో కన్నా ప్రపంచంలో ఓ వింత ఫోబియా ఉంది. అదే ‘అరాకిబ్యూటిరో ఫోబియా’.

పీనట్ బటర్ తిన్నప్పుడు అది నోటిపైన అంగిలికి అతుక్కుంటుదేమో అన్న భయం ఇది.