ఈ వారం ఈ రాశులవారికి అనుకోకుండా డబ్బు చేతికందుతుంది



మేషం
మేష రాశివారికి ఈ వారం శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. తలపెట్టిన పనులు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తిచేస్తారు.



వృషభం
వృషభ రాశివారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. చేసే పనిలో నైపుణ్యత ఉండేలా చూసుకోండి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.



మిథునం
మిథున రాశివారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. చేపట్టిన పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎలాగైనా పూర్తిచేయగల సామర్థ్యం మీ సొంతం. ఇంట్లో వాతావరణం మాత్రం కాస్త గందరగోళంగా ఉంటుంది. పొట్టకు సంబంధించిన ఇబ్బదులు ఎదుర్కొంటారు.



కర్కాటకం
ఈ వారం మీకు అదృష్టం కలిసొస్తుంది. అవసరానికి ధనం చేతికందుతుంది. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగిపోతాయి. నూతన వాహనం, ఇల్లు కొనుగోలు చేసే యోగం ఉంది. విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం. మీ మాటకున్న విలువను కాపాడుకోండి.ఎప్పటి నుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.



సింహం
సింహ రాశివారికి ఈ వారం అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆర్థికంగా కలిసొచ్చే కాలం ఇది



కన్య
ఈ వారం కన్యారాశివారు అనుకున్న పని అనుకున్నట్టు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలవైపు దృష్టి మళ్లుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చెప్పుడు మాటలు విని అయినవారిని విస్మరిస్తారు.



తుల
తులా రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. తలపెట్టిన పనిలో సాధ్యాసాధ్యాలు చూసుకున్నాకే ముందడుగు వేయడం మంచిది. ముఖ్యమైన పనులు పూర్తిచేయాలంటే మనోధైర్యంతో ముందుకు సాగండి. వాహన వ్యాపారులకు లాభాలొస్తాయి. స్థిరాస్థి కొనుగోలు చేయాలనుకునేవారు ధైర్యంగా అడుగేయవచ్చు.



వృశ్చికం
వృశ్చిక రాశివారికి ఈ వార ధనలాభం ఉంటుంది. ఓ విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులు ఏ విషయాన్ని పట్టించుకోకుండా తమపని తాము చేసుకుంటే పోతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుతాయి.



ధనస్సు
ధనస్సు రాశివారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉన్నాయి. తలపెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు. అవరానికి డబ్బు చేతికందుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారికి నిరాశ తప్పదు. ఓ వ్యవహారంలో మీ ముందుచూపు ప్రశంసలు అందుకుంటుంది.



మకరం
ఈ వారం మకర రాశివారికి ఆర్థికంగా కలిసొచ్చే కాలం. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి.



కుంభం
ఈ వారం కుంభరాశివారికి అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. స్నేహితుల నుంచి శుభవార్త వింటారు. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు.



మీనం
తలపెట్టిన గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఇబ్బందులను అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం ఈ వారంలో తీసుకునే అవకాశం ఉంది. ఓ శుభవార్త మీకు ఆనందాన్నిస్తుంది.