లెహెంగాలో యువకుడి డ్యాన్సులు, చూపు తిప్పుకోలేరు

న్యూయార్క్‌లో ఉన్న వారికి ‘మెన్ ఇన్ స్కర్ట్స్’అంటే చాలు జైనీల్ మెహెతా గుర్తొచ్చేస్తారు.

కుచ్చుల లెహెంగాలో జైనీల్ చిందేస్తే బాలీవుడ్ హీరోయిన్లు గుర్తుకు రావాల్సిందే.

జైనీల్‌ది ముంబై. చిన్నప్పట్నించి క్లాసికల్ డ్యాన్సు నేర్చుకున్నారు. పదమూడేళ్ల వయసులో అమెరికా వలస వెళ్లారు.

డ్యాన్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టారు.

ఏడేనిదేళ్ల వయసు నుంచే ఇలా లెహెంగాలో డ్యాన్సులు వేయడం మొదలుపెట్టానని చెబుతున్నారు జైనీల్.

లెహెంగాల రంగులు, కుచ్చులు నచ్చుతాయని అందుకే అవి వేసుకుని డ్యాన్సులు చేయడం ప్రారంభించినట్టు చెబుతారు.

అలియా భట్ సినిమా ‘గంగూబాయి కఠియావాడి’ సినిమాలోని ‘జుమె రె గోరి’ పాటకు డ్యాన్సు చేస్తే దాదాపు కోటి డబ్బై లక్షల మంది వీక్షించారు.

అలాగే ‘సామి సామి’ పాటకు చక్కగా నాట్యం చేశారు జైనీల్.

ఎన్నో ఉమెన్ ఓరియంటెడ్ పాటలకు నర్తించి ‘మెన్ ఇన్ స్కర్ట్స్’గా మారుమోగి పోయారు.