ముద్దు అంత అవసరమా?

ముద్దు పేరు చెబితే ముడుచుకుపోతారు చాలా మంది, అదేదో పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తారు.

నిజానికి ముద్దుకు మానసిక ఆనందానికి, ప్రశాంతతకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది.

మనసులోని ప్రేమను, ఆపేక్షను ఎదుటివారికి పంచే ఓ రియాక్షన్ గా ముద్దును వర్ణిస్తారు.

ముద్దు అంటే రెండు బంధాలను మరింత దగ్గర చేసే చక్కటి స్పర్శ.

అలెగ్జాండర్ తన దండయాత్రలో భాగంగా అన్ని రాజ్యాలు తిరుగుతూ పాశ్చాత్య ముద్దులను విశ్వవ్యాప్తం చేశారని చెప్పుకుంటారు.

1500 BC కాలంలో వారు ముక్కును ముక్కుతో రుద్దడం ద్వారా తమ ప్రేమను పంచుకునేవారని, అలా పెదవులపైకి ముద్దు జారి ఉండొచ్చని కూడా టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన మానవ శాస్త్రవేత్త వాన్ బ్రయంట్ భావిస్తున్నారు.

ముద్దు పెట్టుకునే సమయంలో పెదవుల నుంచి పుట్టే ప్రేరణ మన మెదడుకు అనేక సానుకూల తరంగాలను పంపుతుంది.

ఆ తరంగాలు ప్రేమ, సురక్షితంగా ఉన్నామన్నా భావనలను పెంచుతాయి.

సెరోటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోషాన్ని పెంచే రసాయనాలు విడుదలవుతాయి.

పిల్లలకు తల్లిదండ్రులు పెట్టే ముద్దు వారిలో వెయ్యి ఏనుగుల బలాన్ని పెంచుతుంది.