మాంసాహారం ఇలా తింటే కంటిచూపుకు దెబ్బే



మాంసాహారం అధికంగా తినేవారి చూపు సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతోంది ఓ కొత్త అధ్యయనం.



పచ్చిమాంసంలో పరాన్నజీవి అయిన టాక్సోప్లాస్మాగోండి ఉంటుందని వారు కనుగొన్నారు.



ఈ పరాన్న జీవి కారణంగా రెటీనాపై మచ్చలు వచ్చే అవకాశం ఉందని, చూపు కూడా తగ్గుతుందని గుర్తించారు.



పరిశోధనలో భాగంగా 5000 మంది రెటీనా చిత్రాలను విశ్లేషించారు.



ఆ చిత్రాల ఆధారంగా టాక్సోప్లాస్మోసిస్ సమస్య ఉన్నట్టు గుర్తించారు.



మాంసాన్ని పూర్తిగా మానేయమని మాత్రం పరిశోధకులు సిఫారసు చేయడం లేదు. కొన్ని సూచనలు మాత్రం ఇస్తున్నారు.



ఆరు బయట గంటల కొద్దీ నిల్వ ఉంచిన మాంసాన్ని తెచ్చుకోకూడదు.

ముఖ్యంగా వండినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పసుపు, ఉప్పు వంటి వాటితో మాంసాన్ని శుభ్రం చేయాలి.



అలాగే సరిగా ఉడకకుండా తినకూడదు. చాలా సేపు బాగా ఉడికించిన తరువాతే తినాలి.



ఇలా అధిక ఉష్ణోగ్రత వద్ద అధిక సమయం ఉడికితే పరాన్నజీవులు, వైరస్‌లు మరణిస్తాయి. వాటి వల్ల ఎలాంటి సమస్యా రాదు.