మాట,దేహం,మనస్సు శుద్ధి అంటే ఏంటి!



పంచపునీతాలంటే....
1.వాక్ శుద్ధి 2. దేహ శుద్ధి 3.భాండ శుద్ధి 4. కర్మ శుద్ధి 5.మనశ్శుద్ధి



వాక్ శుద్ధి : వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .అందుకే వాక్కును దుర్వినియోగం చేయకూడదు.



దేహ శుద్ధి : మన శరీరం దేవుని ఆలయం లాంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చేయాలి. చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.



భాండ శుద్ధి : శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం . అందుకే ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి . స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది .



కర్మ శుద్ధి : అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు. అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.



మనశ్శుద్ధి : మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. అదే ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి .



ఈ పంచపునీతాలను పాటిస్తే శత్రువులుండరు, ప్రశాంతత కోల్పోరు, అనారోగ్యం పాలవరు, అపజయం అనే మాటే దరిచేరదు...



Image Credit: Pinterest