Weekly Horoscope 18 july to 24 july 2022
వారఫలాలు జులై 18 సోమవారం నుంచి 24 ఆదివారం వరకు



మేషం
ఈ వారం అనుకున్న పనులు అనుకున్నట్టు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వ్యాపారులు, పారిశ్రామిక వర్గాలవారికి ఉత్సాహవంతమైన సమయం.



వృషభం
ఈ వారం మీకు ఓ శుభవార్త ఆనందాన్నిస్తుంది. అప్పుల బాధనుంచి విముక్తి పొందుతారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొత్త ఇల్లు తీసుకోవాలి అనుకున్నవారికి అనుకూల సమయం



మిథునం
మీలో ఓర్పే మీకు మంచి చేస్తుంది. బుద్ధిబలంతో ఎంతటి పనినైనా పూర్తిచేయగలుగుతారు. మీరంటే గిట్టినివారు మిమ్మల్ని తప్పుతోవ పట్టిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు, వ్యాపారులకు శుభసమయం.



కర్కాటకం
ఈ వారం కర్కాటక రాశివారు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఓసారి ఆలోచించండి. స్థిరాస్తి పెంచుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ వారం అనుకూల ఫలితాలే.



సింహం
ఈ వారం ఏ పని మొదలెట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారులు , ఉద్యోగులకు కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. అనవసర ప్రయోగాలు చేయకండి.



కన్య
ఈ రాశివారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసొస్తాయి. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు గౌరవం పొందుతారు.



తుల
తులా రాశివారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాల్లో మెరుగుదల కనిపిస్తోంది. దీర్ఘకాలిక బాధల నుంచి ఉపశమం లభిస్తుంది. ఇబ్బందులున్నా మనోధైర్యంతో ఒడ్డున పడతారు. కీలక విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.



వృశ్చికం
ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభాలొస్తాయి. కళారంగం వారికి అనుకూలసమయం. వారం ప్రారంభంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కొంటారు.



ధనుస్సు
కొన్ని రోజులుగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కీలక విషయాల్లో శ్రద్ధగా వ్యవహరించాలి. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారులకు మంచి సమయం.



మకరం
ఈ వారంలో మకరరాశివారిని ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకున్న పనులు ముందుకు సాగవు. కుటుంబంలో కొత్త సమస్యలు ఎదురవుతాయి.



కుంభం
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తారు.భూములు,వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. వ్యాపారం విస్తరించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. మ వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం.



మీనం
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.వ్యాపారాలు బాగా సాగుతాయి. చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.