ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది.



ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.



మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది.



అనంతరం టీమిండియా 42.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.



రిషబ్ పంత్ (125 నాటౌట్: 113 బంతుల్లో, 16 ఫోర్లు, రెండు సిక్సర్లు) సెంచరీ సాధించాడు.



మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా పంత్‌కే లభించింది.



మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును హార్దిక్ పాండ్యా దక్కించుకున్నాడు.



ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (60: 80 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.



హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు.



దీంతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు రెండిటినీ 2-1తో సొంతం చేసుకుంది.
(All Images Credit: BCCI)