కోస్తా ప్రాంతంపైన విండ్ కన్వర్జన్స్ (గాలుల సంగమం) కారణంగా ఆంధ్రాలో పలు చోట్ల స్వల్ప వర్షాలు



రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం



రాయలసీమలో పొడి వాతావరణం ఉండే అవకాశం



కాకినాడ నగరంలో నిన్న అత్యధికంగా 36 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు



గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు భాగాలతో పాటుగా బాపట్ల​, ఉత్తర ప్రకాశం జిల్లాలో కొద్దిసేపు కురిసిన వర్షాలు



తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం



ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఎల్లో అలర్ట్



హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 19 డిగ్రీలు