తెలంగాణలో క్రమంగా చలి తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి పూట చలి విషయంలో నేడు అన్ని జిల్లాల్లో సాధారణంగానే ఉండనుంది - IMD హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.7 డిగ్రీలుగా నమోదు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.