నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు మాస్టర్ బెడ్‌రూమ్ ఉందోలేదో చూసుకోవాలి
ఆగ్నేయంలో వంట గది ఉండాలి
ఈశాన్యంలో ద్వారం,గృహం మధ్యన ఖాళీ ఉండటం అవసరం
నైరుతిలో బాల్కనీ ఉండరాదు
ఇల్లు దిక్కులు క్రాస్ గా కాకుండా సరిగా ఉండాలి
ప్రతి పోర్షన్ చదరంగా లేదా దీర్ఘ చతురస్త్ర ఆకారంలో ఉండాలి, వృత్తాకారంలో అస్సలు ఉండకూడదు
నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు
ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి
వీధిపోట్లు, రోడ్డునుంచి పల్లంగా ఉన్న ఇళ్లు మంచివికావు
టాయ్‌లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది.
ఇంట్లో మీకన్నా ముందు అద్దెకు ఎవరున్నారు, వాళ్లకి కలిసొచ్చిందా మరింత నష్టపోయారా, ఏవైనా ఇబ్బందులు పడ్డారా, యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయా, ఇంకా అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, కుటుంబంలో కలహాలు జరిగాయా తెలుసుకోవాలి.
ఆ పోర్షన్ తరచూ ఖాళీ అవుతోందా అన్నది కూడా గమనించాలి. ఎందుకంటే వాస్తు బావున్న ఇళ్లు తరచూ ఖాళీ అవవు.