తిరుమల శ్రీవారి ఆస్తుల చిట్టాను టీటీడీ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా శ్రీవారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వెల్లడించింది

దేశంలో 960 ప్రాంతాల్లో శ్రీవారికి భూములు ఉన్నాయి.

మొత్తం రూ.87,705 కోట్ల విలువైన 7,124 ఎకరాల భూమి ఉంది.

1974-2014 మధ్య వేర్వేరు టీటీడీ ట్రస్టులు 113 ప్రాపర్టీలను అమ్మేశాయి.

2014 తర్వాత ఆస్తుల్ని విక్రయించలేదని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

శ్రీవారి పేరుతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం ఉన్నాయి.

జాతీయ బ్యాంకుల్లో శ్రీవారికి రూ.14,000 కోట్ల FDలు ఉన్నాయి.

దేవదేవుడికి 14 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.

ఏటా టీటీడీ ఆస్తులపై వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేస్తున్నామని సుబ్బారెడ్డి అన్నారు.