డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి రూ.81.2ను టచ్‌ చేసింది.

శుక్రవారం పతనంతో రూపాయి ఈ ఏడాది 8 శాతం పతనమైంది.

రూపాయి బలహీన పడితే దిగుమతులు మరింత ప్రియం అవుతాయి.

కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు దిగుమతులు చేసుకుంటాయి.

దాంతో పెరిగిన ఖర్చును కంపెనీలు కస్టమర్లపై వేస్తాయి.

రూపాయి విలువ తగ్గితే విదేశీ ప్రయాణాల ఖర్చు పెరుగుతుంది.

భారత్‌ 85 శాతం క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతాయి.

ట్రాన్స్‌పోర్ట్‌, ఇంధన ధరలు పెరిగితే ఇంటి బడ్జెట్‌ భారమవుతుంది.

ఫెర్టిలైజర్‌ కంపెనీలు కొన్ని ముడి వనరులను దిగుమతి చేసుకుంటాయి. దాంతో ఎరువుల ధర పెరుగుతుంది.

విదేశీ విద్య భారమవుతుంది. ఎందుకంటే చెల్లింపులన్నీ డాలర్లలోనే ఉంటాయి.