ఇంటర్నేషల్ మార్కెట్‌లో చమురు ధర దోబూచులాడుతోంది. ఒకరోజు పెరిగితే తర్వాతి రోజు తగ్గుతోంది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1.74 డాలర్లు తగ్గి 88.70 డాలర్ల కాగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 81.75 డాలర్లు అయింది హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. వరంగల్‌లో లీటరు పెట్రోల్ ధర ₹ 109.10 గా నిర్ణయమైంది. డీజిల్ ధర ₹ 97.29 రేటు వద్ద ఉంది. కరీంగనర్‌లో నిన్న లీటరు పెట్రోలు ₹ 109.78 కు చేరింది. డీజిల్ ధర ₹ 97.92 గా నమోదైంది. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర ₹ 111.54 వద్ద ఉంది. డీజిల్ ధర ₹ 99.31 రేటు ఉంది. విశాఖలో లీటరు పెట్రోల్ ధర ₹ 110.82 వద్ద ఉంది. డీజిల్ ధర ఇవాళ ₹ 98.59 గా నమోదైంది. తిరుపతిలో లీటరు పెట్రోల్ ధర ₹ 111.87 గా నిర్ణయమైంది. డీజిల్ ధర ఇవాళ ₹ 99.56 కి చేరింది. కర్నూలులో లీటరు పెట్రోలు ధర ₹ 112.03 అయింది. డీజిల్ ధర ఇవాళ ₹ 99.76 వద్ద ఉంది. అనంతపురంలో పెట్రోలు ధర ₹ 111.66 గా ఉంది. డీజిల్ ధర 99.42 గా నమోదైంది.