బ్యూటీ క్వీన్ త్రిషను ఎలా మరిపోగలం చెప్పండి. చక్కని నటనతో కుర్రాళ్ల మనసు దోచేసిన ఈ చెన్నై చిన్నది ‘పొన్నియిన్ సెల్వన్’లో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా త్రిషా, సిద్ధార్థ్ ‘పొన్నియిన్ సెల్వన్’ ఈవెంట్‌లో సందడి చేశారు. ‘యువ’ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’ సినిమాతో సినీ ప్రేమికులకు మరింత దగ్గరయ్యారు. అయితే, వీరిద్దరూ జోడిగా మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, బ్యాడ్ లక్ ఆ తర్వాత ఇద్దరూ మంచి స్టార్స్ అయ్యారేగానీ, కలిసి నటించలేదు. కొన్నాళ్ల కిందట ‘కళావతి’ సినిమాలో జంటగా కనిపించి ఆకట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరు ‘పొన్నియిన్ సెల్వన్’ ట్రైలర్ రిలీజ్‌లో కలుసుకున్నారు. కానీ, సిద్ధార్థ్ ఈ సినిమాలో లేడు కదా అనేగా మీ సందేహం? సిద్ధార్థ్ వచ్చింది అతడి రూమర్ గర్ల్ ఫ్రెండ్ అదితి రావు హైదరీ గురించని టాక్. (Credit: LYCA) కానీ, సిద్ధార్థ్ త్రిషాతో ఉన్న ఈ ఫొటోనే బాగా వైరల్ అవుతోంది. Images and Video Credit: LYCA/Instagram and Twitter