థోర్: లవ్ అండ్ థండర్ గురువారం మనదేశంలో విడుదల అయింది. కథ: గోర్ (క్రిస్టియన్ బేల్) దేవుళ్లను చంపాలనే లక్ష్యంతో ఒక్కో దేవుడిని చంపుకుంటూ వస్తాడు. ఒకానొక దశలో థోర్, గోర్‌లు ఒకరికొకరు ఎదురుపడే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, విలన్ ఎమోషనల్ కనెక్షన్ మీదనే దర్శకుడు టైకా వైటిటీ ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇంతకుముందు వచ్చిన థోర్ చిత్రాల కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కథ పూర్తిగా గోర్ చుట్టూనే తిరుగుతుంది. తన కథలోకే థోర్ వస్తాడు. రెగ్యులర్ మూవీ లవర్స్‌ను ఈ సినిమా సంతృప్తి పరిచినా, థోర్ అభిమానులకు ఒకింత అసంతృప్తి మిగలడానికి ఇదే కారణం అవుతుంది. నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. థోర్ పాత్ర మీద ఎక్కువ అంచనాలు లేకుండా ఒక కథ లాగా చూస్తే ఈ సినిమా నచ్చుతుంది.