మధుమేహులు రాత్రి పూట తినకూడనివి ఇవే

జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, వారసత్వం, తీవ్ర ఒత్తిడి, అధిక క్యాలరీలుండే ఆహారం... వీటి వల్లే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.

ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం, రక్తంలో గ్లూకోజ్ పెరగడం వల్ల డయాబెటిస్ సమస్య మొదలవుతుంది.

కొత్తగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం మధుమేహం ఉన్నవారు రాత్రిపూట అధిక మొత్తంలో ఆహారం తినకూడదు.

ముఖ్యంగా అతిగా శుద్ధి చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల వారిలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

ఉదయం తేలికపాటి ఆహారం, మధ్యాహ్నం తృణధాన్యాలు, రాత్రి పూట ఆకుకూరలు, పాలు, ప్రాసెస్ చేయని మాంసం తినడం వల్ల డయాబెటిస్ రోగుల్లో దీర్ఘాయుష్షు కలుగుతుంది.

రాత్రిపూట అధిక ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల ఇతర రోగాల బారిన పడడం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

షుగర్, బెల్లం, చిప్స్, వెన్న తీయని పాలు, బటర్, చీజ్, మైదాపిండితో చేసిన వంటకాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్లు, జ్యూస్‌లు, అధిక కొవ్వు కలిగిన మాంసం తినకూడదు.

ఏం తిన్నా రోజుకు కనీసం గంటసేపు వ్యాయామం చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.