బొప్పాయి అధికంగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే



బొప్పాయి మితంగా తింటే ఎంతో ఆరోగ్యం, కానీ అధికంగా తింటే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



పచ్చి బొప్పాయి తినడం వల్ల మొదటి మూడు నెలల్లో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది.



బొప్పాయిని అధికంగా తింటే కెరటెనెమా అనే సమస్య రావచ్చు. దీని వల్ల చర్మం రంగు మారుతుంది.



శ్వాసకోశ అలెర్జీలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి.



బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి మగవారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతాయి.



బొప్పాయి అధికంగా తింటే పొట్టలో అసౌకర్యం పెరిగిపోతుంది.



బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌లు చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.



గుండె సమస్యలు ఉన్న వారు బొప్పాయిని తక్కువగా తినాలి.