పిస్తాలు తింటే చర్మం మెరిసిపోతుంది పిస్తాలను అమెరికా శాస్త్రవేత్తలు ‘స్కిన్నీ నట్స్’ అని పిలుస్తారు. చర్మాన్ని ఇవి కాంతివంతంగా మారుతుంది. వీటిలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పిస్తాలను తినడం వల్ల మాంసాహారంలో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి. వెజిటేరియన్లకు మంచి ప్రొటీన్ మూలం పిస్తాలు. గుప్పెడు పిస్తాలు తింటే ఒక గుడ్డు తినడంతో సమానం. వీటిలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ తిన్నా బరువు పెరగరు. డయాబెటిస్ ఉన్న వారికి ఇవి మంచి ఆహారం. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. రోజూ గుప్పెడు పిస్తాలు తింటే గుండెకు రక్షణ లభిస్తుంది.