రక్తంలో ప్లేట్‌లెట్లు పెరగాలంటే ఈ పండు తినాలి డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో ప్లేట్లెట్లు పెరుగుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డెంగ్యూ బారిన పడిన వారు కచ్చితంగా తినాల్సిన పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. కివీలతో పాటూ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల డెంగ్యూ జ్వరం త్వరగా తగ్గుతుంది. వీటిని తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువ. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఇవి ముందుంటాయి. కాబట్టి వారానికి రెండు పండ్లు తినేందుకు ప్రయత్నించాలి. ఈ పండు కొవ్వు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. ఈ పండు తినడం వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.