ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటిన వాయుగుండం



తీవ్ర అల్పపీడనంగా బలహీనం, పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తూ నేడు (డిసెంబరు 26) కొమరిన్‌ తీరం దిశగా వస్తుందని అంచనా



ప్రకాశం, బాపట్ల, నెల్లూరు కోస్తా భాగాలతో పాటుగా కృష్ణా జిల్లా కోస్తా భాగాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం



తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలోని వివిధ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు



అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చింతపల్లి, అరకులోయ ఏజెన్సీ ప్రాంతాల్లో కొనసాగుతున్న చలి ప్రభావం



పాడేరు సమీపంలోని జి.మాడుగులలో 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు



తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణమే



హైదరాబాద్‌లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం