యాంటిబయోటిక్స్ తీసుకునేటప్పుడు ఈ తప్పులు చేయద్దు

యాంటీబయోటిక్స్ అంటే ప్రజల దృష్టిలో అద్భుత కషాయం.

ఇన్ఫెక్షన్ల నుంచి బయపడటానికి సహాయపడతాయి, కానీ వాటిని సరిగా తీసుకోకపోతే మాత్రం దుష్ప్రభావాలు తప్పవు.

యాంటీబయోటిక్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

యాంటీబయోటిక్స్ మింగేటప్పుడు పాలు, ఆల్కహాల్, ఎసిడిటీ పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఖాళీ పొట్టతో యాంటీబయోటిక్స్ తీసుకోకూడదు. ఆహారం తిన్న అరగంట తరువాత వేసుకోవాలి.

నిమ్మ జ్యూస్, కొబ్బరి నీళ్లు, పాలతో ఈ ట్యాబ్లెట్లను వేసుకోకూడదు. అలాగే ఐస్ వాటర్‌తో కూడా వేసుకోకూడదు.

గతంలో వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ దాచుకుని మీకు మీరే సొంతంగా అవసరం ఉన్న లేకపోయినా వీటిని మింగకూడదు.

కేవలం వైద్యులు సూచించాకే యాంటీ బయోటిక్స్ వాడాలి.