'ఈటి' (ఎవరికీ తలవంచడు) మార్చి 10న విడుదల కానున్న సందర్భంగా సూర్య తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా, కరోనా తర్వాత పరిస్థితులపై మాట్లాడారు.

వినోదం, విలనిజం, భావోద్వేగాలు ఉన్న సినిమా 'ఈటి'. రాజమౌళి సినిమాల్లో విల‌న్‌లా... 'ఈటి'లో విలన్ కొత్తగా ఉంటారు.

ప్రతి గ్రామంలో, సమాజంలో జరుగుతున్న అంశాలే 'ఈటి'లో కోర్ పాయింట్. ఇంటికి బంధువులు వస్తే అబ్బాయితో కాకుండా అమ్మాయితో మంచినీళ్లు ఇప్పిస్తారు. గొడవ అయితే భార్య సర్దుకుపోవాలని చెబుతారు. అటువంటి అంశాలను దర్శకుడు పాండిరాజ్ సినిమాలో చర్చించారు. 



'ఈటి' కోసం నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాను. అదీ ఒక యాసలో! తమిళంలో అలా ఉంటే బావుంటుందని దర్శకుడు చెప్పడంతో అక్కడ మార్పులు చేశాం. 

కరోనా వల్ల డిజిటల్ మార్కెట్ పెరిగింది. 'జై భీమ్', 'ఆకాశమే నీ హద్దురా' ఓటీటీలో విడుదలై ఆదరణ సొంతం చేసుకున్నాయి. కలకత్తా నుంచి కూడా ఫోన్స్ చేసి ఆ సినిమాల గురించి మెచ్చుకున్నారు. 



కరోనా వల్ల ఓటీటీలకు ఆదరణ పెరగడంతో కంటెంట్ బేస్డ్ సినిమాలను యువత చూస్తున్నారు. కొత్త కథలు, రచయితలు వెలుగులోకి వచ్చారు.

కరోనా వల్ల పర్యాటకంలోనూ పెను మార్పులు వచ్చాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ విదేశాలకు వెళ్లడం తగ్గింది. ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. 

కరోనా సమయంలో కుటుంబ సభ్యులతో అందరూ ఎక్కువ సమయం గడిపారు. ఫ్యామిలీతో ఎలా ఉండాలో చెప్పింది. 

'ఈటి'లో సూర్యకు జోడీగా 'గ్యాంగ్ లీడర్', 'డాక్టర్' ఫేమ్ ప్రియాంకా అరుల్ మోహన్ నటించారు. 

'ఈటి' పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన సినిమా. కత్తి పట్టి సూర్య చేసిన ఫైట్స్, ఆల్రెడీ రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

'ఈటి' ఫ‌స్ట్‌లుక్‌లో సూర్య మాస్‌గా ఉంటే... పాటల్లో క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్నారు.

దర్శకుడు బాలాతో ఒక సినిమా చేస్తున్నాను.

వెట్రిమారన్ 'వాడి వాసల్' కూడా చేయాలి. అయితే... అందులో ప్రతి షాట్ కోసం కనీసం 500 మంది కావాలి. జూన్ నెలలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం.   

'ఈటి' సినిమాను తెలుగులో ఏషియన్ సంస్థ విడుదల చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ హక్కులను వాళ్లు దక్కించుకున్నారు.