వాస్తవానికి వాస్తు ఇంటి స్థలం ఎంపిక నుంచే మొదలవుతుంది. ఇంతకీ ఎలాంటి స్థలం కొనాలి..ఎలాంటి స్థలం కొనుక్కోకూడదు..



నదుల దగ్గర, కొండల దగ్గర, స్మశానాల దగ్గర, దేవాలయం దగ్గరగా ఉన్న ఇళ్ల స్థలాలు కొనకూడదు. అలాంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మిస్తే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు



ఈశాన్యము తగ్గిన స్థలం కొనకూడదు. ఇలాంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటే అందులో నివశించే వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశం వృద్ధి క్షీణిస్తుంది. సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు.



కొనుగోలు చేయాలనుకున్న స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కుల్లో వేరే వారి ప్లేసులు ఉంటే.. అక్కడి నుంచి నీరు మీరు కొనుగోలు చేసే స్థలంలోకి పారకుండా చూసుకోవాలి.



రెండు విశాలమైన ప్లేసెస్ మధ్య ఉన్న ఇరుకైన జాగాని కొనుగోలు చేయొద్దు. దీనివల్ల మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది.



ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ జాగా కొనడం శుభఫలితం. యజమానికి పేరు ప్రతిష్టలు వస్తాయి, సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు.



ఉత్తర- ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఆర్థికి స్థితి అమాంతం పెరుగుతుంది. ఆ ఇంట్లో ఉండే స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు.



తూర్పు- ఈశాన్యం పెరిగిన స్థలం కొనుగోలు చేస్తే సిరి సంపదలతో పాటూ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.



ఇల్లు కట్టుకోవడానికి దీర్ఘ చతురస్రాకారంగా ఉండే స్థలం మంచిది. దాని పొడవు 2 :1 నిష్పత్తులకు మించి ఉండకూడదు.



చతురస్రాకారంగా ఉండే స్థలం వాస్తు సూత్రాలకు అనుగుణంగా కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.



ప్లాటుకు ఉత్తరాన గాని తుర్పున గాని రోడ్డు కలిగిన ప్లాటు మంచిది
ప్లాటుకు తూర్పున పడమర రోడ్డు ఉన్నా మంచిదే.



ఇంటి స్థలానికి ఉత్తరాన కానీ ఈశాన్యంలో కానీ తూర్పువైపున చెరువు, బావి, కుంటలు, నదులు ఉంటే మంచిది.



ఇంటి స్థలానికి పడమర వైపు కొండలు దక్షిణం వైపు ఎత్తుగా ఉన్న ప్లాటు ఉండొచ్చు



ఇవన్నీ మినిమం చూసుకోవాల్సిన విషయాలు... అయితే ఎన్ని తెలుసుకున్నప్పటికీ ఇంటి స్థలాన్ని నేరుగా వాస్తు పండితులకు చూపించిన తర్వాతే ఇంటి నిర్మాణం ప్రారంభించడం మంచిది.