శుభకృత్ నామసంవత్సర కర్కాటకం రాశి ఫలితాలు ( పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు మీనరాశిలో ఉండటం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది.
శని సప్తమంలో, రాహుకేతువులు 10,4 స్థానాల్లో ఉండటం వల్ల ఈ ఉగాది నుంచి మీకు అంతా శుభసమయమే. రాజకీయంగా, సాంఘికంగా , ఇంటా-బయటా గౌరవ మర్యాదలు దక్కుతాయి.
భాగ్య స్థానంలో గురు, రాజ్య స్థానంలో రాహువు వల్ల విశేష లాభాలున్నాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఆనందంగా ఉంటారు
సన్నిహితుల సలహాలు, సూచనలు పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది సంతానం విషయంలో సంతోషంగా ఉంటారు, అవివాహితులకు వివాహయోగం , వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి
శని, కేతువు వల్ల మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి, తలపెట్టిన పనులు పూర్తి చేసేందుకు కష్టపడాలి మొండిబాకీలు అతి కష్టంమీద వసూలవుతాయి, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి
నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది, అధికారులకు పదోన్నతి ఉంటుంది, విద్యార్థులు పోటీపరీక్షల్లో సక్సెస్ అవుతారు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగం మారే అవకాశం ఉంది
వ్యవసాయం, తోటల రంగాల వారికి గిట్టుబాటు ధర విషయంలో సంతృప్తి ఉండదు. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది.
వ్యాపారం బాగాసాగుతున్నా వారిలో సంతృప్తి ఉండదు, భాగస్వామ్య వ్యాపారాలు అస్సలు కలిసిరావు ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతాయి
పుణ్యకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు ఉన్నప్పటికీ అవన్నీ త్వరలోనే సమసిపోతాయి ఆరోగ్య సమస్యలు వెంటాడినా వైద్యసేవలతో కుదుటపడతారు
ఈ రాశి పురుషులు...స్త్రీల వల్ల లాభపడతారు
మీ తెలివితేటలకు గురుబలం తోడవటం వల్ల ఈ ఏడాది మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది