శ్రీముఖి అందం ఎరుపెక్కింది. రెడ్ కలర్ డ్రెస్ లో రాములమ్మ మెస్మరైజ్ చేసింది. బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న షోలలో 'స రే గ మ ప' ఒకటి. ఇప్పుడు 'స రే గ మ ప' షో లేటెస్ట్ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆగస్టు 14న గ్రాండ్ ఫైనాలే టెలికాస్ట్ కానుంది. రెడ్ కలర్ లెహంగా, బ్లౌజ్‌తో 'స రే గ మ ప' సీజన్ ముగించారు శ్రీముఖి. గ్రాండ్ ఫినాలేకి ఇలా సందడి చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఈ డ్రెస్ లో శ్రీముఖి అందం అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్. ఈటీవీ షో 'జాతి రత్నాలు' షోకి కూడా శ్రీముఖి హోస్ట్ చేస్తున్నారు. శ్రీముఖి ముఖారవిందం చూశారా? నుదట పాపిడి బిళ్ళ, చెవులకు కమ్మలతో కొత్తగా ఉన్నారు. టీవీ షోస్ తో పాటు శ్రీముఖి సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్'లో ఒక రోల్ చేస్తున్నారు. నితిన్ 'మాస్ట్రో'లో శ్రీముఖి ఒక రోల్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అని ఒక సినిమా వచ్చింది. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.