యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ షోకు గుడ్‌బై చెప్పడంతో స్రవంతి లైన్ క్లియరైంది. ఔనండి, అనసూయ ఎగ్జిట్‌తో స్రవంతికి గేట్లు తెరుచుకున్నాయట. స్రవంతి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ ఓటీటీలో కంటెస్టెంట్‌గా స్రవంతి పాల్గొంది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్ వల్ల స్రవంతికి మరింత గుర్తింపు లభించింది. స్రవంతి ప్రస్తుతం తన హాట్ ఫొటోలతో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది. నల్లని లో-దుస్తుల్లో ఇసుకను శరీరానికి రాసుకుంటున్న ఫొటోలను స్రవంతి పోస్ట్ చేసింది. కొద్ది రోజుల కిందట కూడా ఇన్ఆర్బిట్‌లో ఓ ఈవెంట్‌లో స్రావ్ తన అందాలు ఆరబోసింది. మరి ‘జబర్దస్త్’లో అనసూయ లేని లోటును స్రవంతి ఎంతవరకు తీరుస్తుందో చూడాలి. ‘జబర్దస్త్’లో ఛాన్సంటే లక్కీ మాత్రమే కాదు, పెద్ద సవాల్ అనే సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’లో మెప్పిస్తే.. స్రవంతికి సినిమా అవకాశాలు కూడా క్యూ కట్టవచ్చు. Credits: Sravanthi Chokarapu/Instagram