ఐపీఎల్ 2024లో శనివారం రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో అశుతోష్ శర్మ (31: 16 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. రాజస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో యశస్వి జైస్వాల్ (39: 28 బంతుల్లో) అత్యధిక స్కోరు సాధించాడు. షిమ్రన్ హెట్‌మేయర్ (27 నాటౌట్: 10 బంతుల్లో) చివర్లో జట్టును గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ, శామ్ కరన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును షిమ్రన్ హెట్‌మేయర్ గెలుచుకున్నాడు.