ఐపీఎల్‌లో ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను ఫ్యాన్స్ ‘ఎల్ క్లాసికో’ అని పిలుచుకుంటూ ఉంటారు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69: 40 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివం దూబే (66 నాటౌట్: 38 బంతుల్లో) అర్థ సెంచరీ సాధించాడు. చివర్లో మహేంద్ర సింగ్ ధోని (20 నాటౌట్: 4 బంతుల్లో, మూడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితం అయింది. రోహిత్ శర్మ (105 నాటౌట్: 63 బంతుల్లో) అజేయ శతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. నాలుగు వికెట్లతో చెలరేగిన చెన్నై బౌలర్ పతిరణకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.