హోలీ ఎందుకు జరుపుకోవాలి!

వసంత కాలంలో వాతావరణంలో మార్పులు మొదలవుతాయి..చలిగాలులు తగ్గి వేడి మొదలవుతుంది

వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది

రంగులు కలిపిన నీటిని ఒకరిపై మరొకరు చల్లుకుంటే వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది

అయితే కృత్రిమ రంగులు కాదు..ఔషధ మొక్కల నుంచి తయారుచేసిన సహజసిద్ధమైన రంగులు వేసుకోవాలి

కుంకుమ, పసుపు, బిల్వాలతో ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలు తయారు చేస్తారు..

మోదుగ పువ్వుల్ని మరిగించి వాటితో రంగులు తయారు చేస్తారు...

ఔషధ లక్షణాలు కలిగిన సహజసిద్దమైన రంగులు చల్లుకుంటే ఆరోగ్యానికి మంచిది

ఇప్పుడు వినియోగిస్తున్న కృత్రిమ రంగులవల్ల ఆనందం మాటెలా ఉన్నా అనారోగ్యం తప్పదు