దీపారాధన తర్వాత కాలిన వత్తుని ఏం చేయాలి?

Published by: RAMA

నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తుంటారు

దీపారాధన సమయంలో వత్తులు కాలిన తర్వాత మిగిలినవి ఏం చేయాలనే సందేహం ఉంటుంది

సగం కాలిన వత్తులను చెత్తబుట్టలో వేయకూడదు..వాటిని సేకరించాలి

ఓ రెండువారాల పాటూ సేకరించి వాటిని కర్పూరం, లవంగాలు వేసి వెలిగించి ఇల్లంతా ధూపం వేయాలి

ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూలశక్తి మాయమవుతుందని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు

వత్తులు పూర్తిగా మిగిలిన భస్మాన్ని ఏదైనా పనులపై బయటకు వెళ్లేటప్పుడు బొట్టుగా పెట్టుకోవాలి

పిల్లలకు దిష్టి తీసేందుకు కూడా ఈ భస్మాన్ని ఉపయోగించవచ్చు

ఇంకా భస్మం మిగిలితే..చెట్టు దగ్గర వేయడం, పారే నీటిలో కలపడం చేయాలి