మీరే గొప్ప అనే భ్రమలో ఉన్నారా..అయితే ఇది మీకోసమే!

సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకకు వెళ్లిన ఆంజనేయుడిని సీతమ్మ ఓ ప్రశ్న అడిగింది...

ఇంతమంది వానరులు ఉన్నా ఎవ్వరూ రాలేకపోయారు నువ్వొక్కడివే వచ్చావ్..

మరి రావణుడిపై దండయాత్ర చేసేటప్పుడు ఈ లంకా పట్టణానికి ఎవరు రాగలరు హనుమా?

అమ్మా నీకు తెలియక అడుగుతున్నావా..నీకు తెలిసే అడుగుతున్నావా అంటూ ఇలా సమాధానం ఇచ్చాడు ఆంజనేయుడు

సాధారణంగా అంతఃపుర స్త్రీల దగ్గరకు పంపించేటప్పుడు...తమ వద్ద అందరికన్నా తక్కువబలంతో ఉన్నవాడినే పంపిస్తారు

సుగ్రీవుడి దగ్గర అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడిని నేనే అందుకే శ్రీరాముడి ధర్మపత్ని దగ్గరకు నన్ను పంపించారు

సుగ్రీవుడి దగ్గరున్నవారు అందరూ నాతో సమాన బలురు..నాకన్నా అధికబలురు..

నా కన్నా తక్కువ బలం ఉన్నవారు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా..అందుకే రాణవలంకకు నన్ను పంపించారు...

ఇంత గొప్పగా ఎవరైనా ఆలోచించగలరా!
Image Credit: playground.com