హోళికా దహనం టైమ్ ఏంటి - రంగులు ఎప్పుడు చల్లుకోవాలి!

మార్చి 13 , 14 ఈ 2 రోజులు పౌర్ణమి తిథి ఉండడంతో హోలీ ఎప్పుడు అనే చర్చ వచ్చింది

సాధారణంగా పండుగలన్నీ సూర్యోదయానికి తిథి ఉన్న రోజే జరుపుకుంటాం...కానీ పౌర్ణమి, అమావాస్య రాత్రికి ఉండడమే ప్రధానం

మార్చి 13 గురువారం ఉదయం పదిన్నరకు ప్రారంభమైన పౌర్ణమి ఘడియలు మార్చి 14 శుక్రవారం పదకొండున్నవరకూ ఉన్నాయ్

మార్చి 13 రాత్రికి పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి హోళికా దహనం గురువారం రాత్రి జరుపుకోవాలి

ప్రహ్లాదుడిని చంపేందుకు సోదరి హోళిక సహాయం తీసుకుంటాడు హిరణ్యకశిపుడు

ప్రహ్లాదుడితో సహా మంటల్లో దిగి మాడి మసైపోతుంది హోళిక..ప్రహ్లాదుడిని నారాయణుడు రక్షిస్తాడు

హోళిక అనే రాక్షసి పీడ తొలగిపోయినందుకు గుర్తుగా హోలికా దహనం జరుపుకుంటారు

ఆనందం కోసం రంగులు చల్లుకునేవారు మార్చి 14 శుక్రవారం ఉదయం హోలీ సెలబ్రేట్ చేసుకోవచ్చు