మీ సమస్యలు తీర్చే శ్లోకాలివే



హాయగ్రీవ స్తోత్రం
విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి, చదివినది గుర్తుంచుకోవడానికి నిత్యం హయగ్రీవ స్తోత్రం, సరస్వతి ద్వాదశ నామాలను పఠించాలి.



గోపాల స్తోత్రం
సంతానం కోసం చెట్టు పుట్ట చుట్టూ తిరుగుతున్న వారు నిత్యం గోపాల స్త్రోత్రం పఠించే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కడుపుతో ఉన్నవారు ఈ స్తోత్రం నిత్యం చదివితే సుఖ ప్రసవం అవుతుందని, సంతానం ఆరోగ్యంగా పుడతారు.



నవగ్రహ స్తోత్రం..
నవగ్రహ స్తోత్రం నిత్యం చదువుకుంటే అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతికూలంగా ఉన్న గ్రహాల ప్రభావం తగ్గుతుంది.



లక్ష్మీ అష్టోత్ర శతనామావళి
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి నిత్యం పారాయణం చేస్తే ఇంట్లో సరిసంపదలకు లోటుండదు. పిల్లలు మంచి సద్గుణాలు కలిగి ఉంటారు. ఇంట్లో అవివాహితులుంటే మంచి సంబంధం కుదురుతుంది.



దక్షిణామూర్తి శ్లోకం
ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం పెట్టి నిత్యం పదినిముషాలైనా భక్తితో ఆయన్ని పూజిస్తే అపమృత్యు భయం తొలగిపోతుందని చెబుతారు. మేధాశక్తి పెరగడంతో పాటూ ధారణ, స్పష్టత కలుగుతుంది. విద్యార్థులకు మాత్రమే కాదు అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది.



విష్ణు సహస్రం-లలితా సహస్ర నామ స్త్రోతం
విష్ణు, లిలతా సహస్రనామ స్తోత్రాలు పఠిస్తే కుటుంబసభ్యుల మధ్య విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి అందరి మధ్యా సత్సంబంధాలు నెలకొంటాయి. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందట.



సూర్యాష్టకం-ఆదిత్య హృదయం
సూర్యధ్యానం చేస్తే ఆరోగ్యంతో పాటూ కెరీర్ పరంగానూ మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం చేస్తున్నవారు చదివితే ఉన్నత స్థానం పొందుతారు, ఉద్యోగం లేనివారు నిత్యం పఠిస్తే మంచి అవకాశాలు పొందుతారు.



Image Credit: Pinterest