నిద్ర గురించి షాకింగ్ నిజాలు

శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండి చురుగ్గా పనిచేయాలంటే సమతులాహారంతో పాటూ సరైన నిద్ర కూడా అవసరం.

నిద్ర అవసరాన్ని తెలిపేందుకు ప్రతి ఏడాది మార్చి మూడో శుక్రవారం ‘వరల్డ్ స్లీపింగ్ డే’ నిర్వహిస్తారు.

ఒక మనిషి తన జీవితకాలంలో మూడో వంతు నిద్రలోనే గడుపుతారు.

1965లో ఒక టీనేజర్ నిద్రపోకుండా 11 రోజులు ఉన్నాడు. అదో ప్రపంచ రికార్డు.

నిద్రలోనే కొంతమంది పనులు చేస్తారు. ఈ స్థితిని పారాసోమ్నియా అంటారు. ఈ వ్యాధితో బాధపడేవాళ్లు నిద్రలోనే డ్రైవింగ్ చేయడం,వేరొకరిని హత్య చేయడం వంటివి కూడా చేస్తారు.

ప్రపంచజనాభాలో 15 శాతం మంది స్లీప్ వాకర్స్.

ఆహారలేమి కన్నా నిద్రలేమే మనుషుల్ని త్వరగా చంపేస్తుంది.

స్లీప్ వాకర్‌ని బలవంతంగా నిద్రలేపకూడదు.వారిని నిద్రలేపితే గుండె పోటు లేదా కోమాలోకి వెళ్లే ఛాన్సు ఎక్కువ.

నిద్రలేమి వల్ల నొప్పి తట్టుకునే శక్తి తగ్గిపోతుంది. సరైన నిద్ర వల్ల ఏ గాయమైనా త్వరగా నయమవుతుంది.